కాలుష్యంపై పోరాటానికి జేఏసీ ఏర్పాటు
పటాన్‌చెరు, జూన్ 23: కాలుష్య సమస్యపై పోరాటానికి ఖాజీపల్లి గ్రామస్థులు జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రముఖ న్యాయవాది, పర్యావరణవేత్త దండే రమాకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో జేఏసీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా దండే రమాకాంత్ మాట్లాడుతూ.. కాలుష్య సమస్య నుంచి ఖాజీపల్లి గ్రామానికి విముక్తి కలిగించేందుకు జేఏసీని ఏర్పాటు చేసుకున్నామని, త్వరలోనే పరిశ్రమలు, కాలుష్యంపై ఐదు వందల మందితో సుప్రీం కోర్టుకు వెళ్తామని తెలిపారు. వారం రోజుల్లో కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని, అనంతరం ఎన్‌జీటీని ఆశ్రయిస్తామని వెల్లడించారు.
ఖాజీపల్లి కాలుష్య సమస్యపై సినీ హీరో ప్రభాస్ సానుకూలంగా స్పందించారని, ఆయన కూడా తమకు మద్దతుగా పాల్గొంటానని మాటిచ్చారని చెప్పారు. అదే విధంగా కాలుష్య సమస్యపై ఎంపీ బండి సంజయ్ మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. అనంతరం జేఏసీ సభ్యులు, గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భార్గవ్, అశోక్, బీమా, ఆకుల కిరణ్‌కుమార్, మహేశ్, సురేశ్, నరేశ్, మల్లేశ్ పాల్గొన్నారు.






