6 May, 2026 | 10:31 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

దంచికొట్టిన వాన

24-06-2024 12:05 AM

పలుచోట్ల నేలకొరిగిన చెట్లు 

రోడ్లపై నిలిచిన నీరు

భారీ ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులకు ఇక్కట్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): రుతుపవనాల ప్రభావంతో నగరంలో ఆదివారం మధ్యాహ్నం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, చంపాపేట్, సైదాబాద్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్,  ఎస్సార్ నగర్, బోరబండ, పంజాగుట్ట, వనస్థలిపురం, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వాన పడింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్టు నేలకొరిగాయి.

రహదారులపై భారీగా వర్షం నీరు నిలిచింది. దీంతో పాదచారులు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలి గింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.  జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాల సభ్యులు, ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై నిలిచిన నీటిని తొలగించారు. చార్మినార్ మండలంలోని డబీర్‌పురలో అత్యధి కంగా 71.8 మిల్లీ మీటర్లు, హిమాయత్ నగర్‌లోని విటల్‌వాడిలో అత్యల్పంగా 40.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మెహదీపట్నంలో విద్యుత్ స్తంభంపై చెట్టు విరిగిప డడంతో స్తంభం విరిగిపడింది. ఎర్రగడ్డలో కరెంట్ తీగలపై ఓ భారీ వృక్షం విరిగిపడింది.