02-02-2026 04:20:29 PM
మల్లాపూర్,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్లాపూర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతిరెడ్డి మాట్లాడుతూ... కెసిఆరే సిట్ విచారణకు సహకరిస్తే, బి ఆర్ యస్ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చెయ్యడం విడ్డురం అన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని, తప్పు చేయకుంటే ఎవరైనా సరే విచారణను ఎదుర్కొని రుజువు చేసుకోవాలని తెలిపారు.కార్యక్రమం లో ఏఏంసి చైర్మన్,పలు గ్రామాల సర్పంచ్ లు, నాయకులు పాల్గొన్నారు.