19 May, 2026 | 11:24 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

కరీంనగర్‌కు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు

22-04-2024 12:25 AM

కోర్టు అనుమతితో తల్లిని చూసేందుకు దవాఖానకు

కరీంనగర్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు భారీ భద్రత నడుమ కరీంనగర్‌కు వచ్చారు. ఆయన తల్లి అనా రోగ్యంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కోర్టు అనుమతితో ఆమెను చూసేందుకు ఆదివారం ఉదయం వచ్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వర కు తల్లి వద్ద ఉన్నారు. రాధాకిషన్‌రావు తల్లి పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడుతున్నారు. తల్లిని పరామర్శించిన రాధాకిషన్‌రావు.. చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

రాధాకిషన్‌రావును కరీం నగర్ వచ్చిన నేపథ్యంలో హాస్పిటల్ వద్ద భారీగా పోలీసు బందోబ స్తు ఏర్పాటుచేశారు. మీడియాను, ఇతరులను అనుమతించలేదు. మధ్యాహ్నం మూడు గంటలవరకే అనుమతి ఉండటంతో భారీ బందోబస్తుతో తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశా ల మేరకు చంచల్‌గూడ జైలు నుంచి కరీంనగర్ వచ్చి వెళ్లేందుకు ఎస్కార్ట్‌కు అయిన ఖర్చు రూ.౧౮ వేలతో పాటు డీజిల్, భోజనాల ఖర్చును రాధాకిషన్‌రావు భరించారు.