calender_icon.png 1 February, 2026 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు ఫోన్ టాపింగ్ కేసు అంటగట్టడం సిగ్గుచేటు

01-02-2026 03:17:54 PM

సీఎం దిష్టిబొమ్మ దహనం, నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ

రాస్తారోకో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

అడ్డుకున్న పోలీసులు పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు

జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆందోళనలు

మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్

కామారెడ్డి,(విజయక్రాంతి): కేసీఆర్ ఫోన్ టాపింగ్ కేసు అంటగట్టి సీట్ విచారణ చేపట్టడం సిగ్గు చేటని మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రం తో పాటు మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీలు నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసనలు సీఎం దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ ను, తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తుగడల వల్ల సీట్ విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేసిఆర్  సీట్ విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడం తగదన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ప్రతి మండల కేంద్రంలో మేజర్ గ్రామాల్లో మండల కేంద్రాలతో పాటు పట్టణ కేంద్రాలు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు ర్యాలీలు రాస్తారు ఒక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. రైతులకు రైతుబంధు ఇచ్చి ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందన్నారు. ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రం తోపాటు ఎల్లారెడ్డి బాన్సువాడ జుక్కల్ బిచ్కుంద పట్టణాల్లో, మండల కేంద్రాల్లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నల్ల బ్యాడ్జీలతో ధరించి నిరసన వ్యక్తం చేశారు. కొత్త బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబుద్దిన్, బాన్సువాల్లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బిచ్కుంద లో జుక్కల్  మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే, ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా మండల పార్టీ బిఆర్ ఎస్ నా యకులు, గ్రామస్థాయి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.