16 June, 2026 | 6:19 PM

పిర్జాదిగూడ, మేడిపల్లి ప్ర‌భుత్వ పాఠశాలలకు బీఆర్ఎస్ నాయకుల అండ‌

16-06-2026 05:46 PM

ఆరుగురు విద్యావాలింటీర్లకు వేత‌నం, కిచెన్ షెడ్ల నిర్మాణం, మ‌ర‌మ్మ‌త్తుల‌కు హామీ

మాజీ కార్పోరేట‌ర్లు, నాయ‌కుల‌తో క‌లిసి.. స్కూల్స్‌ సంద‌ర్శించిన మాజీ మేయ‌ర్ జ‌క్క వెంకట్ రెడ్డి

బీఆర్ఎస్ నాయ‌కుల ఔదార్యంపై ప్ర‌జ‌ల హ‌ర్షం

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పోరేట‌ర్లు, నాయ‌కులు అండ‌గా నిలిచారు. ఆరుగురు విద్యావాలంటీర్ల నియామ‌కం చేసి, వారికి ప్ర‌తి నెల వేత‌నం ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు. అలాగే మేడిప‌ల్లి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో నూత‌నంగా కిచెన్ షెడ్డుతో పాటు పీర్జాదిగూడ‌, ప‌ర్వ‌తాపూర్ స్కూల్స్‌ల‌లో కిచెన్ షెడ్ల మ‌ర‌మ్మ‌త్తులు చేయిస్తామ‌ని హామీ ఇచ్చారు. నూత‌న విద్యా సంవ‌త్స‌రంలో పాఠ‌శాల‌లు పుఃన ప్రారంభ‌మైన నేప‌థ్యంలో మాజీ మేయ‌ర్ జ‌క్క వెంక‌ట్ రెడ్డి, మాజీ కార్పొరేట‌ర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి మేడిప‌ల్లి, పీర్జాదిగూడ హైస్కూల్స్‌ను,  ప‌ర్వాతాపూర్ అప్ప‌ర్ ప్రైమ‌రీ స్కూల్‌ను మంగళవారం సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా ఆయా పాఠ‌శాల‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ఉపాధ్యాయుల‌ను, విద్యార్థుల‌ను అడిగి తెలుసుకున్నారు. అయితే మూడు పాఠ‌శాల‌ల‌కు కూడా పూర్తి స్థాయిలో అడ్మిష‌న్లు వ‌స్తున్న‌ప్ప‌టికీ సాంక్ష‌న్ పోస్టులు లేని కార‌ణంగా ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల నియామ‌కం జ‌ర‌గ‌డం లేద‌ని ఆయా స్కూల్స్ ప్ర‌ధానోపాధ్యాయులు, మాజీ మేయ‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. వెంట‌నే స్పందించిన మాజీ మేయ‌ర్ జ‌క్క వెంక‌ట్ రెడ్డి మూడు స్కూల్స్‌ల‌లోను ఆరుగురు విద్యావాలంటీర్ల నియామ‌కం చేసి, వారికి ప్ర‌తినెల వేత‌నం మాజీ కార్పోరేట‌ర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

మేడిప‌ల్లి, పీర్జాదిగూడ‌, ప‌ర్వ‌తాపూర్‌ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో కిచెన్ షెడ్డు నిర్మాణం, మ‌ర‌మ్మ‌త్తుల‌తో పాటు ఆరుగురు విద్యా వాలంటీర్ల నియామ‌కం, వేతనాల బాధ్య‌త‌ను బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేట‌ర్ దొంతిరి హ‌రిశంక‌ర్ రెడ్డి, కొల్తూరి మ‌హేష్‌, బీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఆకుల మధుకర్, యాసారం శ్రీనివాస్, మునికుంట్ల కిరణ్ గౌడ్ స్వ‌చ్ఛందంగా ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల ఔదార్యంపై ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. పేద‌, మ‌ద్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు చెందిన విద్యార్థులు చ‌దువుతున్న పాఠ‌శాల‌లో స‌క‌ల వ‌స‌తులు క‌ల్పించాల‌నే బీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల సంక‌ల్పం ఆద‌ర్శ‌నీయ‌మ‌ని ఆయా పాఠ‌శాల‌లో విద్య‌న‌భ్య‌సిస్తున్న విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆనందం వ్య‌క్తం చేశారు.