16 June, 2026 | 6:58 PM

తాండూరు గ్రామంలో గ్రామసభ

16-06-2026 06:16 PM

ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ కౌన్సిల్ బోరంచ సాయిలుకు సన్మానం చేసిన పాలకవర్గం

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామంలో గ్రామ సభ గ్రామ సర్పంచి యాద గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసి ఆదాయవ్యాయాలతో పాటు గ్రామ అభివృద్ధి ప్రణాళిక గురించి చర్చించడం జరిగిందని గ్రామ సర్పంచ్ యాదా గౌడ్ తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది.ఎక్కువ మొత్తంలో గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అలాగే గ్రామానికి చెందిన బోరంచ సాయిలు ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ కౌన్సిల్ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా ఎంపికైన సందర్భంగా తాండూర్ గ్రామ సర్పంచ్ యాద గౌడ్, పాలకవర్గం సభ్యులు గ్రామపంచాయతీ కార్యాలయంలో శాలువతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యాద గౌడ్ మాట్లాడుతూ... తాండూరు గ్రామానికి చెందిన వ్యక్తి బోరంచ సాయిలు ఇండియన్ నేషనల్ వుమెన్ రైట్స్ ప్రొటక్షన్ కౌన్సిల్ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం గ్రామానికి గర్వంగా ఉందని తెలిపారు.

గ్రామంలోని యువకులు విద్య పరమైన తమ లక్ష్యాన్ని ఎంచుకొని మంచి స్థాయికి ఎదిగి గ్రామానికి మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిన వారిని సన్మానించడం జరిగిందని సర్పంచ్ యాదవ్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాద గౌడ్,ఉప సర్పంచ్ అభిషేక్,కార్యదర్శి కార్తీక్, వార్డ్ మెంబర్లు,గ్రామ పెద్దలు ప్రభాకర్,మునిగేపల్లి సంగయ్య, సంజీవులు,బోరంచ సాయిలు,గాజుల గోపాల్, తదితరులు పాల్గొన్నారు.