ఎరువుల వేటలో గిరిజనేత రైతులు
* ప్రభుత్వం ఏర్పాటుచేసిన " యాప్ లో " గిరిజనేతలలో పేర్లు కనుమరుగు..
* ఎరువుల కొనుగోలుకు తండాలు పడుతున్న ఏజెన్సీలోని గిరిజన రైతులు
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో స్వతంత్రానికి ముందు పోరంపోగు, ఇతర Workshop భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న గిరిజనేతర రైతులు యూరియాతోపాటు రసాయన ఎరువుల కోసం పడిగాపులు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రసాయన ఎరువులను రైతులకు అందించుటకు ప్రత్యేకంగా యాప్ ను ఏర్పాటు చేశారు. రైతుల పేరుతో ఉన్న సాగు భూమి సర్వే నంబర్, ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ కు వ్యవసాయ శాఖ అధికారులు లింక్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ తీసుకువచ్చిన యాప్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 24521 మంది రైతులకు సంబంధించిన సాగు భూముల వివరాలు నమోదు కాలేదు.
యాప్ లో సాగు చేసే భూముల వివరాలు నమోదు అయితే మొబైల్ ఫోన్ కు ఓటిపి వస్తుంది. మొబైల్ ఫోన్ కు వచ్చిన ఓటిపి ఆధారంగా యూరియాతోపాటు రసాయన ఎరువులు తీసుకునే వెసులుబాటు ఉంది. మొబైల్ ఫోన్లో రైతుల పేర్లు వివరాలతో కూడిన ఓటిపి ప్రకారమే రైతులకు ఎరువులను వ్యాపారులు అందిస్తున్నారు. సాగు భూములు నమోదు కాని ఏజెన్సీ లోని గిరిజనేతర రైతులు ఎరువుల కోసం వ్యాపారులతోపాటు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులకు యూరియాతోపాటు రసాయన ఎరువులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజనేతర రైతులు కోరుతున్నారు.
* అప్పుల కోసం రైతుల పొడి కాపులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనేతర రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలను నిలిపివేయడంతో పంటల సాగు కోసం గిరిజనేతర రైతులు అప్పుల కోసం పడిగాపులు కాస్తున్నారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో గిరిజనేతర రైతులకు అప్పుల బాధ తప్పడం లేదు. ఎన్నికల సమయంలో గిరిజనేతర రైతులకు బ్యాంకుల నుండి పంట రుణాలు ఇప్పించడంతోపాటు బ్యాంకు నుండి గిరిజనేతర రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తానని ఉట్నూర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిన నేటికీ ఆ హామీ నెరవేరలేదని గిరిజనేత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గిరిజనేతర రైతులు బ్యాంకు నుంచి తీసుకున్న పంట రుణాలు మాఫీ అవుతాయని బ్యాంకులకు చెల్లించవలసిన రుణాలు సైతం రైతులు చెల్లించలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో గిరిజనేతర రైతులు బ్యాంక్ అధికారుల ముందుకు వెళ్లేందుకు సాహసం చేయడం లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గిరిజనేతర రైతులు రెట్టింపు అప్పుల పాలై బ్యాంకులకు వెళ్లకుండా , వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి పంటల సాగుకు అప్పు పొందుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీలోని గిరిజనేతర రైతులకు ఇచ్చిన హామీ ఈ ఖరీఫ్ సీజన్లో అమలు చేసి గిరిజనేతర రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
* యూరియా కోసం తిరుగుతున్న..
* శివ దాస్ బాలేరావ్, గిరిజనేత రైతు, భూర్సన్ పాటర్.. ఇంద్రవెల్లి మండలం..
తనకు భూర్సన్ పాటర్ లో నాలుగు ఎకరాల పి పి ల్యాండ్ సాగు భూమిని 75 ఏళ్లుగా సాగు చేస్తున్నానని అన్నారు. ఈసారి పంట సాగు కోసం అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కొరకు తిరుగుతున్న యాప్లో లేదంటూ ఎరువులు ఇవ్వడం లేదు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరడం లేదు.. ఇప్పటికైనా గిరిజనేతర రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
* సాగు ఈసారి కష్టమే...
* మనోహర్ రైతు.. ఇంద్రవెల్లి
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఒకపక్క వర్షాలు రావడం లేదు.. మరోపక్క ఎరువుల కోసం తిరుగుతున్న వ్యవసాయ అధికారులు అందుబాటులోకి రావడం లేదు. ఎరువులు కొనుగోలు చేయాలంటే వ్యవసాయ అధికారులు యాప్ లో ప్రభుత్వ భూమి వివరాలు నమోదు చేయాలని వ్యాపారులు అంటున్నారు. ఈసారి వ్యవసాయం చాలా కష్టంగా ఉందని మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి వాటికి పరిష్కార మార్గం చూపాలని కోరారు.






