31-05-2025 12:37:14 AM
కరీంనగర్, మే 30 (విజయ క్రాంతి): ప ట్టణంలోని 33వ డివిజన్ భగత్ నగర్ లో లిటిల్ ఆర్కిడ్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ ను మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తో కలిసి నగర మాజీ మేయర్ సునీల్ రా వు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మాజీ మేయర్ సునీల్ రావు, ఆర్కిడ్ ప్లే స్కూల్ నిర్వాహకులు కిరణ్మయిలు మాట్లాడుతూ... ప్రాథమిక విద్యాభ్యాసం అభ్యసిం చక ముందే చిన్నారులకు ఈ ప్లే స్కూల్ ఎం తగానో ఉపయోగపడుతుందని అన్నారు.
ప్రస్తుత కాలంలో తల్లిదండ్రు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ బిజీ జీవితం గడుపుతు న్నారని.. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండి చిన్నపిల్లల సంరక్షణ వారి కుటుంబ సభ్యులు చూసుకునేవారని కానీ ప్రస్తుతం ఉన్న తరుణంలో చిన్నపిల్లలు ఇలాంటి ప్లే స్కూల్లో సంరక్షణ పొందడంతో పాటు విద్య ను అభ్యసించేందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు.
ఈ ప్లే స్కూల్లో మాంటెస్సోరి విద్యా విధానం ద్వారా.. పిల్లలకు ఆటపాటలతోపాటు విద్యానందించినున్నట్టు తెలిపా రు. అదేవిధంగా చిన్నారుల సంరక్షణను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఒలంపిక్స్ అసోసి యేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, స్కూల్ నిర్వాహకులు కిరణ్మయి, లావణ్య, బిఆర్‌ఎస్ యువ నాయకులు సత్తినేని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.