30 June, 2026 | 7:54 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

జిల్లాలో వానాకాలం పంట ప్రణాళిక సిద్ధం

31-05-2025 12:35 AM

లక్ష్యం 343240 ఎకరాలు

కరీంనగర్,ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో వానాకాలం పంట ప్ర ణాళిక ఖరారైంది.జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం కంటే అధికంగా వానాకాలం లో పంటల సాగు అవుతుందన్న అంచనా ను అధికారులు వేశారు. జిల్లాలో వివిధ పం టల సాధారణ సాగు విస్తీర్ణం 3,43,240 ఎకరాలు  సాగు చేస్తారని అంచనా వేశారు.  మండలాల్లోని క్లస్టర్ల వారీగా సాగు విస్తీర్ణం అంచనాలను వ్యవసాయ అధికారులు రూ పొందించారు.

ఇందులో ప్రధానంగా వరి 2,76,500 ఎకరాలు, మొక్కజొన్న 4000 ఎకరాలు, కందులు 1000, పత్తి 48000,  ఎకరాలు,  మిరప 1000 ఎకరాలు, పలు కూరగాయల ఇతర పంటలు కలిపి వానాకా లం సీజన్లో 3,43,240 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు  చేస్తారని అంచనా వేశారు.ఎరువుల ప్రణాళిక ...జిల్లాలో ప్రతి పాదించిన పంటల విస్తీర్ణం ఆధారంగా ఎరు వుల ప్రణాళికలు తయారు చేశారు.

జిల్లాకు అవసరమైన ఎరువుల సరఫరా కోసం ప్ర భుత్వానికి ప్రతిపాదనలను అధికారులు స మర్పించారు. ప్రస్తుత ఏప్రిల్ మాసం నుంచి రానున్న వానాకాలం సీజన్లో సెప్టెంబరు వర కు  యూరియా 43254 మెట్రిక్ టన్నులు, డీఏపీ 6944, ఎంఓపీ 26,057, ఎస్‌ఎస్పీ 7730 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయ ని అంచనా వేశారు.

నకిలీ విత్తన విక్రయాలపై ప్రత్యేక నిఘాఅంచనాలు రూపొందించాం- భాగ్యలక్ష్మిజిల్లా వ్యవసాయ శాఖ అధికారిజి ల్లాలో రానున్న వానాకాలం పంట సాగు అంచనాలను రూపొందించాం. అందుకు అ నుగుణంగా విత్తనాలు, ఎరువులను రైతుల కు అందుబాటులో ఉంచేందుకు కసరత్తులు చేస్తున్నాం. జిల్లాలో ప్రధానంగా వరి,పత్తి,  మొక్కజొన్న, ఇతర పంటలను సాగు చేస్తా రు. ఇందుకు తెలంగాణ విత్తనాభివృద్ధి సం స్థ ద్వారా సిద్ధం చేస్తున్నాం. 

రైతులకు పంట సాగుపై అవగాహన కల్పించడానికి ప్రణాళిక రూపొందిం చాం. నకిలీ పత్తి, ఇతర విత్తన విక్రయాలను అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ తనిఖీల్లో భాగంగా పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి బృందాలను ఏర్పాటు చేశాం.