calender_icon.png 19 February, 2026 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత పార్టీకే వెన్నుపోటు పొడవటమే లక్ష్యమా?

19-02-2026 01:05:58 AM

ఎమ్మెల్యే పాయల్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి రామన్న ఫైర్

ఆదిలాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం గురించే ప్రజలు, స్వంత పార్టీ నేతలు వేస్తున్న ప్రశ్నలకు ఎమ్మెల్యే పాయల్ సమాధానం చెప్పలేకపోతున్నారని, అదే ఫ్రస్టేషన్‌లో మితిమీరి వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీమంత్రి జోగు రామన్న అన్నారు. స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యే పాయల్ వ్యాఖ్యలను ఖండించారు.

బీ.ఆర్.ఎస్ పార్టీ అంతర్గత విషయాలపై ఎమ్మెల్యేకు సంబంధమేంటని ప్రశ్నించిన ఆయన... అడుగడుగునా ప్రజలు ప్రశ్నిస్తుంటే ఏ మాట మాట్లాడాలో తెలియక తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడింది ఎవరో ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలలో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఏ విధంగా చైర్మన్ పీఠాన్ని పంచుకున్నాయో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రౌతు మనోహర్,  అజయ్, ఇజ్జగిరి నారాయణ, సాజితోద్దీన్, గండ్రత్ రమేష్, వెనుగంటి ప్రకాష్, కేమ శ్రీకాంత్, కొండ గణేష్, తదితరులు పాల్గొన్నారు.