19-02-2026 01:07:13 AM
ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్
ఆదిలాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ పోర్ట్ కోసం మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయిందని, ఎన్నికల సమయంలో కుట్ర లు, కుతంత్రాలు చేసినట్లు జిల్లా అభివృద్ధిలో విభేదాలు లేకుండా అన్ని రాజకీయ పక్షాలు కలిసి అభివృద్ధికి సహకరించాలని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు.
బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎయిర్ పోర్టుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేశారు. ఎయిర్ పోర్టుకు అనుసంధానంగా ఆదిలాబాద్ జిల్లాలో మరో 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ అభివృద్ధికి రాజకీయ పక్షాలు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.