calender_icon.png 19 February, 2026 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో లైఫ్ సైన్సెస్ కీలకం!

19-02-2026 01:05:06 AM

  1. దేశ జీడీపీలో తెలంగాణ వాటా  10 శాతానికి పెంచేందుకు కృషి
  2. బయో ఏషియా 2026 ముగింపు వేడుకలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 
  3. రైజింగ్ తెలంగాణలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాం తి): తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్‌హౌస్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంక ల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు.  లైఫ్ సైన్సెస్ రంగంలో కేవలం రెండేళ్లలోనే (డిసెంబర్ 2023జనవరి 2026) రూ.73,360 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, లక్ష ఉద్యోగాలను సృష్టించామని వివరించారు.

బుధవారం హైటెక్స్‌లో “బయో ఏషియా 2026” సదస్సు లో భాగంగా “తెలంగాణ రైజింగ్ 2047’  బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం” పేరిట నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్, ముగింపు వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.  దేశ జీడీపీలో తెలంగాణ వాటా ను 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతోనే ప్రజ లు, నిపుణుల భాగస్వామ్యంతో “తెలంగాణ రైజింగ్ 2047”కు శ్రీకారం చుట్టామన్నారు.

2047 నాటికి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేలా లైఫ్ సైన్సెస్ రంగం ఎకో సిస్టంను మరింత బలోపేతం చేసేందుకు సమ గ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే.... తెలం గాణ నెక్ట్స్- జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ(2026- 2030), తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్, 1బయో ఇంక్యూబేటర్, జీనోమ్ వ్యాలీ విస్తరణ, ఫార్మా విలేజెస్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ను మరింత బలోపేతం చేసేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీకి శ్రీకారం చుట్టామన్నారు. 

రెండు వేలకు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థల కార్యకలాపాలు

రాష్ర్టంలో ప్రస్తుతం 2,000కు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో మూడో వంతు ఎగుమతుల్లో అయిదో వంతు వాటా తెలంగాణదే కావడం గర్వకారణమన్నారు. ఈ ఏడాది సదస్సులో సనోఫీ, ఒపెల్లా, వ్యాక్సిండో యానిమల్ హెల్త్, ట్రెడెన్స్, ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ర్టంలో పెట్టుబడులు ముందుకొచ్చాయన్నారు.

బ్రిటన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, యూకే తదితర దేశాల నిపుణులతో లైఫ్ సైన్సెస్ రంగంలో రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు, అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్వహించిన ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాలు తెలంగాణ బ్రాండ్‌ను మరింత విశ్వవ్యాప్తం అయ్యేందుకు దోహదం చేస్తాయన్నారు. 

‘బయో ఎకానమీ’ రంగంలో మూడో అతిపెద్ద శక్తిగా ఎదగడానికి భారత్‌కు ఉన్న అవకాశాలు, తెలంగాణ పాత్రపై చర్చించి.. ప్రత్యేక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌తో కలిసి ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహించామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ సారి ఫార్చ్యూన్ 500 కంపెనీల ప్రతినిధులతో పాటు దేశ విదేశాల నుంచి మొత్తం 4,394 మంది ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు.

కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యా ల కోసం 4వేలకు పైగా అత్యున్నత స్థాయి బిజినెస్ టూ బిజినెస్ సమావేశాలకు ఈ ఏడాది సదస్సు వేదికగా నిలిచిందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగాన్ని తమ ప్రభుత్వం కేవ లం వ్యాపారంగా మాత్రమే కాకుడా సామాజిక బాధ్యతగా చూస్తున్నామన్నారు. అన్ని రకాలుగా పారిశ్రామికాభివృద్ధికి అనుకూలంగా ఉన్న రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టి రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.

ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు మంత్రి శ్రీధర్‌బాబు

ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026’ లో ఐటీ, పరిశ్రమ లు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన ఈ అత్యున్నత స్థాయి సదస్సులో 20 దేశాల ముఖ్య నేతలు, ప్రతినిధులు, 40 దేశాలకు చెందిన నిపుణులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. గురు, శుక్రవారాల్లో నిర్వహించే పలు సమావేశాల్లో శ్రీధర్ బాబు పొల్లొని కీలకోపాన్యాసం చేస్తారు.

గురువారం ఉద యం 9.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటా రు. ప్రపంచ ప్థాయి ఏఐ నిపుణులు, పరిశోధకులు పాల్గొనే పలు కార్యక్రమాల్లో ఆయ న ప్రసంగిస్తారు. యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ సభ్యులు, దిగ్గజ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులు, బ్యాంకింగ్ రంగాల కు చెందిన పలువురు ముఖ్యులతో ఆయన భేటీ అవుతారు.

డిజిటల్ గవర్నెన్స్ అడ్వయిజరీ, ఆల్ బ్రైట్ స్టోన్ బ్రిడ్జ్ గ్రూప్ లాంటి  గ్లోబల్ స్ట్రాటెజిక్ అడ్వయిజరీ సంస్థల ప్రతినిధులు, నిపుణులను ఉద్దేశించి కీలకో పన్యాసం చేస్తారు. స్వీడన్ వాణిజ్య బందం తో భేటీ అవుతారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు.