నోటి మాట కాదు... చూపిస్తాం రండి
ఆర్డిఎక్స్ ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిన మాజీ మంత్రులు డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆర్డీఎస్ ప్రాజెక్టుల సందర్శన చేసి తాము చేసిన పనులను పూర్తిస్థాయిలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తామని మాజీ మంత్రులు డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బయలుదేరారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీఎస్ ప్రాజెక్టుల సందర్శించి రైతులకు జరుగుతున్న అన్యాయం వివరిస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Rangareddy Project) తొంభై శాతం పనులను పూర్తి చేశామని మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కాలయాపన చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆ విషయాలను పూర్తిస్థాయిలో మీడియాకు చూపిస్తామని స్పష్టం చేశారు. బయలుదేరిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.






