9 May, 2026 | 1:11 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

మల్లిఖార్జున స్వామి కళ్యాణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

24-03-2025 08:13 PM

పాపన్నపేట: మండల పరిధిలోని తమ్మాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి మెదక్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ లావణ్య రెడ్డి, మాజీ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు తాడేపు సోములు, ఏడుపాయల దేవస్థానం మాజీ ఛైర్మెన్ బాలగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మెన్ పోలీస్ వెంకట్రాంరెడ్డి రెడ్డి, మండల మాజీ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు జగన్, మాజీ ఎంపీపీ దుర్గయ్య, తాజా మాజీ సర్పంచ్ లు శ్రీనాథ్ లింగారెడ్డి, మల్లేశం, గ్రామ అధ్యక్షులు సుభాష్ రెడ్డి, నాయకులు అనిల్ రెడ్డి, శ్రీశైలం, సాయిలు, మనోహర్, రాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.