1 September, 2026 | 5:45 PM

బీఆర్ఎస్ సమరభేరి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వండి

01-09-2026 05:13 PM

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి 

జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేసిన గండ్ర

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల దగా పాలనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో చేపట్టనున్న సమరభేరి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy) మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(SP Sirisetty Sankeerth) కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2వ తేది నుండి 8వ తేదీ వరకు భూపాలపల్లి నియోజకవర్గం(Bhupalapally Constituency)లోని వివిధ మండలాలు, గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 1000 రోజుల కాంగ్రెస్ దగా పాలనపై సమరభేరి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీల అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అనుమతి, సహకారం అందించాలని ఎస్పీని ఈ సందర్భంగా గండ్ర కోరారు.