వెంకంపల్లిలో చిరుతపులి ఆనవాళ్లు లేవు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని వెంకంపల్లి గ్రామంలో చిరుత పులి సంచరించిన విషయం అందరికీ తెలిసిందే. పలు పత్రికల్లో కూడా ప్రచురితం కావడం జరిగింది. వెంకంపల్లి లో చిరుత పులి సంచరించిన విషయం పలు పత్రికలో ప్రచురితమైన సందర్భంగా మల్లొకసారి నాగిరెడ్డిపేట్ అటవీ శాఖ రేంజ్ అధికారులు(Forest Department Range Officers) చిరుత సంచరించిన ప్రదేశాన్ని మల్లొకసారి తనిఖీ చేశారు. కానీ తనిఖీల్లో చిరుత సంచరించిన ప్రాంతంలో చిరుతపులి(Leopard) పాదములు, ఇతర ఆనవాళ్లు ఏమి లభ్యం కాలేదని ఎఫ్ఆర్ఓ వాసుదేవ్(FRO Vasudev) తెలిపారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా వెంకంపల్లి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఉదయం 6 గంటల లోపల ఒంటరిగా ఎవరు పంట పొలాలకు వెళ్లకూడదని సూచనలు, సలహాలు, సందేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలుకూరి జ్యోతి సురేందర్ రెడ్డి, ఎఫ్ఆర్ఓ వాసుదేవ్, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ రాఘవేందర్రావు,సిబ్బంది పాల్గొన్నారు.






