calender_icon.png 5 February, 2026 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాయదారి మాటలను ఆపండి

05-02-2026 12:35:42 AM

ఎల్లారెడ్డి అభివృద్ధికి పట్టం కట్టండి

జీవోలు ఉంటే తీసుకురా మాట్లాడదాం 

మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సవాల్

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఆయన ఫామ్ హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 వార్డులకు కౌన్సిల్ అభ్యర్థులను ఖరారు చేసామని ప్రచారం కూడా కొనసాగిస్తున్నామని రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ, గెలుపు ఖాయమని దిమా వ్యక్తం చేశారు.

భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో  ఎల్లారెడ్డి పట్టణంలో ఐదున్నర కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్ నిర్మాణం నిధులు మంజూరు చేసిందన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ కాదా, 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా సుమారు 20 కోట్ల రూపాయల నిధులతో సమకూర్చి మంజూరు చేసింది బిఆర్‌ఎస్ పార్టీ కాదా, ఎల్లారెడ్డి పట్టణంలో మూడు కోట్ల రూపాయలతో చిల్డ్రన్ పార్క్ నిర్మాణం చేసింది మేము కాదా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఐదు కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసి అర్ధంతరంగా పనులు చేయలేక అక్కడే అసంపూర్ణంగా ఉన్నది. ఎల్లారెడ్డి పట్టణంలో సెంట్రల్ లైటింగ్, డివైడర్, గల్లీలలో సిసి రోడ్లు వంటి పనులను చేసింది బిఆర్‌ఎస్ పార్టీ కాదా, అని ప్రశ్నించారు.

కరోనా కష్టకాలంలో ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు ఎల్లారెడ్డి నుండి మెదక్ వెళ్లే ప్రధాన రహదారి మార్గమధ్యలో దేవునిపల్లి శివనగర్ వద్ద రెండు బ్రిడ్జి నిర్మాణ పనులు చేసింది బిఆర్‌ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.  అకాల వర్షాలకు ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారి మార్గమధ్యలో లింగంపల్లి వద్ద వంతెన తెగిపోతే ఇప్పటికి కూడా కనీసం ఒక వంతెన నిర్మాణం చేపట్టలేని, దుస్థితిలో మీరు ఉన్నారు.

స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి సంబంధిత శాఖ మంత్రులను తెచ్చి కనువింపు చేసి కనీసం బ్రిడ్జిని కూడా నిర్మాణం చేయలేని పరిస్థితిలో నీ ప్రభుత్వము ఉంది, అని మండిపడ్డారు. విద్యార్థులకు గురుకుల పాఠశాలలో త్రాగునీరు మురుగునీరు వస్తున్నప్పటికీ కనీసం ఒకరోజు కూడా విజిట్ చేయలేని దుస్థితిలో ఉన్న ఎమ్మెల్యేవు నువ్వని మండిపడ్డారు. మాజీ శాసనసభ్యులు జనార్దన్ గౌడ్, ఉమ్మడి నిజాంబాద్ జిల్లా మాజీ చైర్మన్ దాఫెదర్ రాజు, ఎల్లారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు జలంధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆదిమూలం సతీష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముత్యాల సుజాత, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.