calender_icon.png 15 February, 2026 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ నీచ రాజకీయం

15-02-2026 03:01:06 PM

హైదరాబాద్: కాగజ్‌నగర్‌ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోయినా ఎక్స్ అఫిషియో ఓటు వేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్ అక్రమంగా ఓటు నమోదు చేసుకున్నారని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. ఈ 16న జరిగే ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి కాగజ్‌నగర్‌ మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేయాలని నిర్ణయించుకుంది. కానీ మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ, ఎక్స్ అఫిషియో ఓటు వేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విఠల్ చేత తప్పుడు మార్గంలో ఓటును నమోదు చేయించిందని ఆయన ఆరోపించారు. దండే విఠల్‌కు ఎక్స్ అఫిషియో ఓటు వేసేందుకు అర్హత లేదని, జిల్లా కలెక్టర్, ఎన్నికల సంఘం అధికారులు తక్షణమే విచారణ జరిపి, విఠల్‌ను ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కొనసాగించకూడదని డిమాండ్ చేస్తున్నట్లు కోనేరు కోనప్ప తెలిపారు.