20 April, 2026 | 10:57 PM

మాజీ ఎమ్మెల్యే సురేందర్ అసత్య ప్రచారాలు మానుకోవాలి

20-04-2026 09:54 PM

సురేందర్కు వార్నింగ్ ఇచ్చిన తండా గ్రామస్థులు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మెట్లకుంట తండా,బేజ్గం చెరువు తండా,పల్లెబోగుడు తండా నాయకులు, గ్రామస్థులు మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ ప్రస్తుత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్రావుపై చేస్తున్న దుష్ప్రచారం,పచ్చి అబద్ధాలపై ఘాటుగా ధ్వజమెత్తారు. తండాలలో అభివృద్ధి జరగడం లేదని జజాల సురేందర్ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా ఖండించారు. జజాల సురేందర్  హయాంలో ఏఅభివృద్ధి జరగని తండాలు,  ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హయాంలో  మెట్లకుంట తొండ,బేజ్గం చెరువు,పల్లెబోగుడు తండాలలో సుమారు ₹15 లక్షల విలువైన సీసీ రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి 3 బోర్లుమోటార్లు ఏర్పాటు చేయడం,11 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం,ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణానికి ₹2 లక్షలు కేటాయించడం వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందిస్తున్న ఘనత కూడా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దేనని తెలిపారు.తండా ప్రజలమంతా కలిసి నీకోసం ₹5000 రూపాయలు కూడగట్టి ఇచ్చాము.

జలాల సుందర్ కాంగ్రెస్ పార్టీతో గెలిచి, స్వార్థం కోసం బిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయి ఎల్లారెడ్డి ప్రజలను మోసం చేసిన చరిత్ర నీదే అంటూ జజాల సురేందర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో తండాలకు 100 రేషన్ కార్డులు మంజూరు చేయబడినట్టు తెలిపారు.పేదలకు సన్న బియ్యం అందించిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

రుణమాఫీ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలను వెంటనే మానుకోవాలని హెచ్చరిస్తూ,ప్రస్తుతం నీవెంట తిరుగుతున్న సర్పంచ్‌కే ₹2 లక్షల రుణమాఫీ జరిగిన విషయం గుర్తుచేశారు.నీ హయాంలో రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే,ఈరోజు అందరికీ రుణమాఫీ జరిగేదని నిలదీశారు.ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తండాలలో జరుగుతున్న అభివృద్ధి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషి వల్లనే సాధ్యమైందని తండా ప్రజలు, నాయకులు ఒకే స్వరంతో గట్టిగా ప్రకటించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కేస్లీ వస్త్రం నాయక్, వజ్ర నాయక్,శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.