9 May, 2026 | 8:14 PM

నవ దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ

09-05-2026 07:07 PM

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం నగరం, ఎదులాపురం మున్సిపాలిటీ వెంకటగిరి గ్రామంలో జరిగిన పలు శుభకార్యాలలో బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు శనివారం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.  సాయి నాగ గిరిధర్ వివాహం, ఏలూరు జిల్లా వాస్తవ్యులు బండి శ్రీనివాసరావు-ధనలక్ష్మి దంపతుల కుమార్తె హర్షశ్రీతో నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఖమ్మం వైరా రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఖమ్మం 7వ డివిజన్‌కు చెందిన దొంగల నాగరాజు-రేణుక దంపతుల కుమార్తె శైలు- మనోహర్‌తో జరుగగా వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వెంకటగిరి మాజీ సర్పంచ్ మొర్రి మేకల నాగేశ్వరరావు యాదవ్ కుమారుడు డాక్టర్ ప్రసాద్ వివాహం సౌమ్యతో ఇటీవల జరగగా మాజీ ఎంపీ నామ వారి స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు.