కాంగ్రెస్ మండల కమిటీలను ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు
మూడు నియోజకవర్గాల్లో అన్ని మండల అధ్యక్షులు నియామకం
పెండింగ్ లో వైరా, సత్తుపల్లి మండలాలు
ఖమ్మం,(విజయక్రాంతి): 17ఏళ్ళ తరువాత కాంగ్రెస్ పార్టీ మండల కమిటీలను మార్చింది. కొన్ని మండలాలకు నూతన అధ్యక్షులను పీసీసీ నియమించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నూతన మండల అధ్యక్షుల లిస్ట్ ను శనివారం అధికారికంగా ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లోని అన్ని మండలాలకు నూతన కమిటీ అధ్యక్షులను నియమిస్తూ పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ నూతన మండల అధ్యక్షులకు అభినందనలు తెలిపారు.
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండల కాంగ్రెస్ కమిటీ అద్యక్షులుగా కేలోత్ దేవ్ సింగ్ ను, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం లోని తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కొప్పుల అశోక్ ను, ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ అద్యక్షులుగా తోట వీరభద్రం ను,కూసుమంచి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా బజ్జూరి వెంకటరెడ్డిని, నేలకొండపల్లి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కొడాలి గోవిందరావు ను, ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా భానోత్ కిషోర్ ను, మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా గుడిపూడి బుచ్చిరామయ్య ను,చింతకాని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కన్నేబోయిన గోపి యాదవ్ ను, బోనకల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గా కర్నాటి రామకోటేశ్వరరావు ను, మధిర మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గా పారుపల్లి విజయ్ ను, ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గా బొగ్గుల శ్రీనివాసరెడ్డిని, మధిర పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గా తలుపుల వెంకటేశ్వర్లు ను నియమించినట్లు ప్రకటించారు.






