7 May, 2026 | 1:02 AM

ఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ పర్యటన

07-05-2026 12:21 AM

నూతన వధూవరులకు మాజీ ఎంపీ నామ ఆశీస్సులు

ఖమ్మం, మే 6(విజయ క్రాంతి): ఖమ్మం నగరంలో బీఆర్‌ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు.  చింతకాని మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన వడ్లమూడి సత్యనారాయణసుభద్రల కుమార్తె వనజ వివాహం, బోనకల్ మండలం రామాపురం గ్రామానికి చెందిన తాత సావిత్రి కుమారుడు గోపీనాథ్తో ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు హాజరైన నామ నూతన వధూవరులను ఆశీర్వదించారు.  అనంతరం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని రోటరీ నగర్లో జక్కంపూడి వీరభద్రరావునిర్మల నివాసంలో నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. ఇటీవల వివాహం జరిగిన వారి కుమారుడు, కోడలను దీవించి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ కార్యక్రమాల్లో మోరంపూడి ప్రసాదరావు, గొడ్డేటి మాధవరావు, వాకదాని కోటేశ్వరరావు, రేగళ్ల కృష్ణప్రసాద్, షారుఖ్ తదితరులు పాల్గొన్నారు.