7 May, 2026 | 1:02 AM

సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలి

07-05-2026 12:21 AM

వివాదాస్పద కార్యక్రమాలకు దూరంగా ఉండండి 

ప్రజలకు సేవ చేయండి 

గుర్తిస్తారు, గౌరవిస్తారు, గుర్తుంచుకుంటారు

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

కామారెడ్డి, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): ప్రజలతో మమేకం కండి శాంతియుతంగా ప్రజలతో కలిసి ఉంటూ గ్రామ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా కష్టపడాలని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు స్పష్టం చేశారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నూతన మండల కాంగ్రెస్ అధ్యక్షులతో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బుధవారం సుదీర్ఘంగా సమావేశం నిర్వహించి దిశా దశ నిర్దేశం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నూతనంగా నియమితులైన 8 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల తో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ని  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన మండల అధ్యక్షులకు శాలువాలు కప్పి అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్  మండల అధ్యక్షులకు కీలకమైన భవిష్యత్తు ప్రణాళిక గురించి పలుసూచనలు చేశారు. మండలాలు  గ్రామాల్లో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగుతూ అందరినీ కలుపుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షులు గ్రామాలలో పర్యటిస్తూ పార్టీని పునరవ్యవస్థికరించాలని సూచించారు. 

నాయకులను కార్యకర్తలను ఒక బృందంగా ఏర్పరచుకొని సమర్థ వంతంగా  కలుపుకొని పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో పార్టీ వ్యవహారాలను కార్యక్రమాలను చురుకుగా నడిపించాలని  ప్రజల్లో నిరంతరం కనిపించే నాయకత్వమే నిలదొక్కుకుంటుందని పేర్కొంటూ పట్టుదలతో నిరంతరం కష్టపడే నాయకున్ని ప్రజలు విశ్వసిస్తారని ప్రజలకు అందుబాటులో ఉండి సమయపాలన పాటిస్తూ పనిచేసే నాయకుడే ప్రజల విశ్వాసాన్ని చూడకుంటాడని దానివల్లనే ప్రజల్లో గౌరవం ప్రతిష్ట పెరుగుతుందని అలాంటి వారే భవిష్యత్తులో నాయకులు అవుతారని ఇలాంటి చరిత్రను సృష్టించుకోవాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుల కు హితవు పలికారు.

ఇలాంటి సున్నితమైన ఘాటైన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపారు.  ప్రజలతో మాట్లాడే సందర్భాల్లో మాటల్లో జాగ్రత్త, ప్రవర్తనలో నిబద్ధత,పరిపక్వత అవసరమని సూచించారు. వివాదాస్పద సమావేశాలు, అనవసర రాజకీయ వివాదాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి సమస్యను ప్రశాంతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనే విధంగా ప్రజలతో మమేకమై కష్టపడి ప్రజల్లో గౌరవ ప్రతిష్టను పెంపొందించుకోవాలని సూచించారు.

ప్రతిపక్షాల ప్రచారాన్ని గ్రామ స్థాయిలోనే సమర్థంగా ఎదుర్కోవాలని, కొత్తనాయకులను గుర్తించి పార్టీలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. చురుకుగా ముందస్తు చర్యలను చేపడుతూపని చేయాలి అంటూ పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేయాలని నూతన మండల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. కష్టపడ్డ వారికి గుర్తింపు గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. పదవులు అలంకారప్రాయంగా ఉండవద్దని ఆయన హెచ్చరించారు.

కొత్తగా ఎన్నికైన మండల అధ్యక్షులు పనితీరు పట్ల నిరంతరం పర్యవేక్షణ నిఘా ఉంటుందని కష్టపడండి ప్రజలతో కలిసి ఉండండి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లండి బలోపేతం చేయండి భవిష్యత్తు కష్టపడ్డ వారిదేనని ఎమ్మెల్యే మదన్ మోహన్ నూతన అధ్యక్షులకు హితో హితవు పలికారు. ఈ సమావేశంలో నూతన మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, మైపాల్ రెడ్డి, సాయి యాదవ్, సాయి బాబా,  ప్రవీణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.