calender_icon.png 12 October, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీపీకి పలువురి పరామర్శ

12-10-2025 06:25:13 PM

మందమర్రి (విజయక్రాంతి): మండల పరిషత్ మాజీ అధ్యక్షులు బొలిశెట్టి కనకయ్య తండ్రి చంద్రయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందగా మండలానికి చెందిన పలువురు ఆయనను పరామర్శించారు. ఆదివారం దశదిన కర్మను పురస్కరించుకొని చంద్రయ్య చిత్రపటానికి మండలానికి చెందిన పలువురు రాజకీయ పార్టీల నాయకులు ప్రముఖులు, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణం, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తరలివచ్చి నివాళులు అర్పించారు.