calender_icon.png 12 October, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

12-10-2025 06:18:12 PM

కోదాడ: కోదాడలోని పెరికె భవనం ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన ఈదుల కృష్ణయ్య కుమార్తె వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కోదాడలోని పురమారంగారావు ఫంక్షన్ హాల్ లో సూరేపల్లి వెంకటేశ్వర్లు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్నారు. కోదాడలోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో మంద వెంకటేశ్వర్లు కుమారుని వివాహ వేడుకలో పాల్గొన్నారు. కోదాడలోని కాశీ నాదం ఫంక్షన్ హాల్ లో ఓరుగంటి బ్రహ్మం కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.

కోదాడలో సమావేశ మందిరం నిర్మాణ పనులను పరిశీలించారు. కోదాడలోని గోపిరెడ్డి నగర్ లో తూముల ఏడుకొండలు మనవడి అన్నప్రాసన కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. కోదాడలోని పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో సయ్యద్ బాబా మేనకోడలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. చిలుకూరులోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో కట్టెకోల సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్నారు. చిలుకూరులో శ్రీ రామ్ బైక్ మెకానిక్ వర్క్స్ & ఫోమ్ వాటర్ సెంటర్ ను ప్రారంభించారు.