calender_icon.png 7 February, 2026 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే వంతెన పనులు పరిశీలించిన మున్సిపల్ మాజీ చైర్మన్

07-02-2026 06:48:48 PM

- మున్సిపల్ మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే వంతెన స్లాబ్ నిర్మాణ పనులను ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పావని జంగయ్యయాదవ్ శనివారం పరిశీలించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ రైల్వే వంతెన నిర్మాణంలో భాగంగా నూతన స్లాబ్ ఏర్పాటు కోసం కింద (స్ట్రక్చర్ ) బేస్ నిర్మాణం పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. గత వారం రోజుల క్రితం సంబంధిత కాంట్రాక్టర్ సత్తిరెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు మరో 3 లేదా 4 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారని పేర్కొన్నారు.

మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు, ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వం నుండి కాంట్రాక్టర్ కి రూ. 4 కోట్ల 12 లక్షల నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కావున 17 సంవత్సరాల నుండి ఎంతో ఓపికగా ఉన్న ప్రజలు, నాయకులు, యువత, మహిళలు అందరు మరో 3 లేదా 4 నెలలు మా ప్రభుత్వానికి సహకరించలని కోరారు. ఈ కాంట్రాక్టర్ టీం నరేందర్, శివ  తదితరులు పాల్గొన్నారు.