calender_icon.png 7 February, 2026 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మర్రిపల్లి బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

07-02-2026 06:45:59 PM

వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని ఓ మగ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. సుమారు 50–55 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తి గత మూడు రోజులుగా బస్టాండ్ పరిసరాల్లోనే ఉండి చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మెడలో రుద్రాక్షతో పాటు ఇతర మాలలు ధరించి ఉండేవాడని, మతిస్థిమితం సరిగా లేకపోయినట్టు కనిపించేదని తెలిపారు.

శనివారం ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో బస్టాండ్ ముందు అకస్మాత్తుగా మూర్ఛపడి కుప్పకూలి, అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వేములవాడ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి భద్రపరిచారు.మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా గుర్తించే వారు వేములవాడ రూరల్ పోలీసులను ఫోన్ నంబర్: 8712656417 లో సంప్రదించాలని వేములవాడ రూరల్ పోలీసులు కోరారు.