6 June, 2026 | 1:36 PM

నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

06-06-2026 12:28 PM

కారును ఢీ కొట్టిన కంటేనర్ లారీ 

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి శివారులో ఘటన 

కామారెడ్డి, జూన్ 6 (విజయక్రాంతి): నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్(Former Nizamabad MLA) గుప్త కు త్రుటిలో ప్రమాదం తప్పింది. బీగాల గణేష్ గుప్త ప్రయాణిస్తున్న కారును కంటేనర్ లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి శివారులో 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తకు గాయాలు కాకుండా బయటపడ్డారు. కారులో బెలూన్ లో ఉండడం వల్ల గాయాలు కాకుండా తప్పించుకున్నారు. నిజా మాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతున్న మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తాకు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కంటైనర్ లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం సంభవించినట్లు భిక్కనూర్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా కు ఎలాంటి అపాయం వాటిల్ల లేదు.