13 August, 2026 | 11:22 AM

బిగ్ బ్రేకింగ్: పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా అరెస్ట్

13-08-2026 10:19 AM

బెంగళూరులో అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు 

ముందస్తు బయల్పెటేషన్లో తిరస్కరించిన కోర్టు 

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 13, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక(Former Pinapaka MLA Rega arrested) నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావును(Rega kantharao Arrest) హైదరాబాద్ పోలీసులు బెంగళూరు సమీపంలో అరెస్టు చేశారు. మాజీ  ఎమ్మెల్యే పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాదులోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కాంతారావు పై గత నెల 26న లైంగిక వేధింపుల కేసు నమోదు అయిన విషయం విధితమే.

ఏ మేరకు తనపై నమోదైన కేసు రాజకీయ ప్రేరేపితమైందని, కేసు కొట్టి వేయాలంటూ రేగా కాంతారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతోపాటు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కూడా పిటీషన్ దాఖలు చేయడంతో సాంకేతిక కారణాల కారణంగా పిటీషన్ కోర్టు తిరస్కరించింది. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటున్న రేఖ కాంతారావును హైదరాబాద్ పోలీసులు ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి పక్కా సమాచారంతో బెంగళూరు వద్ద అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.