13 August, 2026 | 10:40 AM

మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో లైంగిక వేధింపుల కలకలం.!

13-08-2026 10:05 AM

విద్యార్థులపై ఉపాధ్యాయుడి స్వలింగ లైంగిక వేధింపులు. 

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థులపై ఉపాద్యాయుడు స్వలింగ లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉర్దూ బోధించే ఒప్పంద ఉపాధ్యాయుడు సయ్యద్ ఇమ్రాన్ పలువురు విద్యార్థులను స్వలింగ లైంగికంగా వేధించినట్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలపడంతో పాఠశాల ప్రిన్సిపాల్‌ను నిలదీశారు.

విద్యార్థులతో మాట్లాడి ప్రాథమిక విచారణ అనంతరం ఉన్నతాధికారులకు తెలియకుండా గొప్యత పాటిస్తూనే ఉర్దూ ఉపాద్యాయుడు సయ్యద్ ఇమ్రాన్‌ను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న  సదరు ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండానే కేవలం విధుల నుంచి తప్పించడం ఉన్నతాధికారులకు విషయం తెలపకుండా గోపిక పాటించడం పట్ల ప్రిన్సిపల్ వ్యవహారంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై మైనార్టీ వెల్ఫేర్ ఇన్చార్జ్ అధికారి రాజేశ్వరిని వివరణ కోరగా విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ దాడికి దిగుతున్నాడని ఫిర్యాదులు చేయడంతో తొలగించినట్లు ఆలస్యంగా నివేదిక పంపినట్లు తెలిపారు.