16 April, 2026 | 5:37 AM

ఇందిరమ్మ ఇండ్లతో పేదల జీవితాలలో వెలుగులు

23-06-2025 03:44 PM

వలిగొండ,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లతో పేదల జీవితాలలో వెలుగులు నిండుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు చెరుకు శివయ్య గౌడ్ అన్నారు. సోమవారం వలిగొండ మండలంలోని సుంకిశాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు పైళ్ల నాగేశ్వరి-మోహన్ రెడ్డి ఇంటికి గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ ఆధ్వర్యంలో శంకుస్థాపన నిర్వహించారు.