14 July, 2026 | 7:20 PM

Breaking News

ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •  

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు

23-06-2025 04:16 PM

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం ఎదుట మేడ్చల్ కాంగ్రెస్ నేత హరివర్థన్ రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి హాజరయ్యారు.  అప్పటి రివ్యూ కమిటీ సభ్యులు జీఏడీ సెక్రటరీ శేషాద్రి, మాజీ సీఎస్ శాంతి కుమారి, లా సెక్టటరీ వాంగ్మూలాలను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. శాంతి కుమారి విదేశాల్లో ఉన్నందున.. వచ్చాక వాంగ్మూలం రికార్డు చేయనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తమను తప్పుదోవ పట్టించినట్లు రివ్యూ కమిటీ తెలిపింది. ఇప్పటి వరకు ఐదుసార్లు జరిగిన దర్యాప్తులో ప్రభాకర్ రావు అధికారులు అడిగిన ప్రశ్నాలకు సరైన సామాధానం చేప్పకుండా దాట వేశారని సమాచారం. మేడ్చల్ మాల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి రేపు సిట్ ఎదుట వాంగ్మూలం ఇస్తానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాలో ఈటల రాజేందర్ ఒకరు.

వాంగ్మూలం ఇవ్వాలని గతంలోనే ఈటలకు సిట్ అధికారులు తెలిపినప్పటికి ముందస్తు కార్యక్రమాల కారణంగా హాజరుకాలేదని గతంలో ఆయన వెల్లడించారు.  అలాగే బీజేపీ నేత ప్రేమేంద్ర రెడ్డి రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిట్ ముందు హాజరైవాంగ్మూలం ఇవ్వనున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తేల్చింది. ప్రభాకర్ రావు చెప్పే విషయాలతోనే రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం తెలుతుందని సిట్ అధికారులు పేర్కొన్నారు.