calender_icon.png 17 July, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

23-06-2025 03:39:44 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రజల నుంచి ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను స్వారితగతిన పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కే.వీర బ్రహ్మచారి నిర్వహించారు.

ఈ సందర్భంగా రెవెన్యూ, ఉపాధి తదితర సమస్యలపై 106 దరఖాస్తులను ప్రజలు అధికారులకు అందజేశారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తెచ్చిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. తమ పరిధిలో సాధ్యం కానీ సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.