31 July, 2026 | 2:03 AM

అన్నపురెడ్డిపల్లి మండలంలో రూ.2.77 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

31-07-2026 01:07 AM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశాల్లో పాల్గొన్న మంత్రి 

అన్నపురెడ్డిపల్లి జూలై 30 (విజయక్రాంతి):రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురె డ్డిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్య క్రమాల్లో అశ్వరావుపేట శాసనసభ్యులు  జా రే ఆదినారాయణ, పినపాక ఎమ్మెల్యే పా యం వెంకటేశ్వర్లు,

జిల్లా కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా గుంపెన గ్రామంలో ఎంహెచ్ రోడ్డు నుండి పప్పుల గోపయ్య ఇంటి వరకు, గ్రామంలోని తొమ్మిది అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.45 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

నరసాపురం గ్రామంలో గాదె సుధాకర్ రెడ్డి ఇంటి నుండి నంద్యాల కేశవరెడ్డి ఇంటి వరకు, అలాగే ఎనిమిది అంతర్గత సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) ద్వారా రూ.117.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.భీమునిగూడెం గ్రామంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

కోండాయిగూడెం గ్రామంలోని 2బీహెచ్కే కాలనీలో పీఆర్‌బీటీ రోడ్డు నుండి కుంజా రాధ ఇంటి వరకు, వీరభద్రం ఇంటి నుండి దుబ్బాకారం నగేష్ ఇంటి వరకు, పద్దం మెహన్రావు ఇంటి నుండి మీడియం తిరుపతిరావు ఇంటి వరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మొత్తం రూ.20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.పెద్దిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రగుంటలో ఆర్ అండ్ బీ రోడ్డు నుండి పైదా వీరకృష్ణ ఇంటి వరకు, అలాగే 17 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.75.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.

పెద్దిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన అగ్గి రాజమ్మ, గుంపెన గ్రామానికి చెందిన మాయారా వసంత, భీమునిగూడెం గ్రామానికి చెందిన వాడే సుజాత, నరసాపురం గ్రామానికి చెందిన తిరుమలదేవి అనిత, చీపుడు జ్యోతి, ఊటుపల్లి గ్రామానికి చెందిన మొల్లచవుకు కవిత, రంగాపురం గ్రామానికి చెందిన వేముల కృష్ణయ్య, పెనుగొండ కోటమ్మల నూతన గృహాల్లో గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్టిఓ మధు,హౌసింగ్ పీడీ, పంచాయతీ అధికారి అనూష, అన్నపురెడ్డిపల్లి తాసిల్దార్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.