పంచాయతీ తీర్మానం బుట్టదాఖలు
నల్లమట్టి తరలింపుకు నాలుగు రోజుల అనుమతి
తీర్మానం ఇవ్వని స్థానిక గ్రామ పంచాయతీ
కానీ పక్క గ్రామపంచాయతీ తీర్మానం ఏలా అనుమతించారు
ఆ వ్యక్తి పై అధికారులకు అంత ప్రేమ ఎందుకు
సెలవులో వెళ్ళిన ఇంజనీరింగ్ అధికారి
బోయినపల్లి: మే 19 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ పెద్ద చెరువు నుంచి నల్లమట్టి తరలింపునకు నీటిపారుదల శాఖ ఇం జనీరింగ్ అధికారులు నాలుగు రోజుల అనుమతిని ఇచ్చారు. స్థానిక గ్రామపంచాయతీ తీర్మానం ఇవ్వాల్సి ఉండగా సర్పంచి తిరుమ ల ఇవ్వలేదు.
కానీ అ చెరువు పక్కనే మరో గ్రామ పంచాయతీ సర్పంచ్ తీర్మానం ఇవ్వ గా దాంతో నీటిపారుదల శాఖ అధికారులు ఈనెల 19 నుంచి 22 వరకు మట్టి తీసుకునేందుకు కొన్ని టిప్పర్ల నెంబర్లు వేసి అను మతి ఇచ్చారు. గత వారం రోజుల క్రితం నల్లగొండ జిల్లా చింతల మండలం పెద్ద చె రువు నుంచి కొందరు ఇటుక బట్టిలకు నల్లమట్టి తీసుకెళ్లేందుకు నీటిపారుదల శాఖ అనుమతి తీసుకొని తరలిస్తుండగా ఆ గ్రామస్తులు కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లగా కో ర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి నిలుపుదల చేసింది.
దీంతో మండలంలోని రెండు చెరువుల నుంచి నల్లమట్టి తరలింపు అనుమతి నిలిచిపోయింది. తాజాగా మళ్లీ కరీంనగర్ జిల్లా రాముడు మండలం వెలిచాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పేరిట నీటి పారుదల శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 19నుంచి 22 వరకు నల్ల మట్టి తరలిం పు కొన్ని టిప్పర్ల నెంబర్లు వేసి అనుమతి ఇ చ్చారు. ఈ విషయంలో ఆ శాఖ అధికారుల కు సమన్వయం కొరవడి ఓ డివిజన్ ఇంజనీరింగ్ అధికారి సెలవులో వెళ్లిపోయారు.
జిల్లాస్థాయి అధికారులు ఆయనపై ఒత్తిడి చూసుకోరాగా హైకోర్టు స్టేజ్ బాగా నల్ల మట్టి తరలింపు ఆయనకు ససేమిరా ఇష్టం లేకపోవడంతో అధికారుల ఒత్తిడి భరించలేక ఆ యన సెలవులు వెళ్లిపోయారు. అధికార పా ర్టీ చెందిన ఓ నేత ఒత్తిడితో నల్లమట్టి తరలింపు అనుమతి రాగా తరలింపు జరుగుతున్నట్లు ఆ శాఖ అధికారులే చర్చించుకుంటు న్నారు. అదేవిధంగా జిల్లాలో ఎన్నో చెరువు కుంటలు ఉండగా బోయినపల్లి మండలం నుంచి రామడుగు మండలం వారు ఎందుకు అనుమతి తీసుకున్నట్లు తెలియడం లేదు.
మొదట అక్కడ వారు అనుమతి తీసుకోగా వివాదం కాగా ఇక్కడి నుంచి అనుమతిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వ ప్రభుత్వ చెరువు కుంటలను రక్షించవలసిన అధికారులు ఈ విధంగా వివరించడం వలన చిన్న నీటి వనరులు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. అధికారులు మాత్రం రామడుగు మండలం వ్యక్తికి అనుమతి ఇవ్వడం పట్ల ఎందుకు అంత ప్రేమ కనబరుస్తున్నారని రైతులు వాపోతున్నారు. --నల్లగొండ జిల్లాకు మాత్రమే కోర్టు స్టే ఇచ్చింది --ఈ ఈ స్యామిల్ కుమార్ విలాసాగర్ పెద్ద చెరువు మట్టి తరలింపు విష యమై ఈఈ శ్యామిల్ కుమార్ ను విజయ క్రాంతి వివరణ కోరగా నల్లగొండ జిల్లాకు మాత్రమే కోర్టు స్టే వర్క్ చేస్తుందని ఆయన చెప్పారు. ఇక్కడ వర్తించదు గ్రామపంచాయ తీ తీర్మానం మేరకు అనుమతి ఇచ్చామని ఆయన చెప్పారు.






