20 May, 2026 | 3:32 AM

రైతు హంతకుల సభ

20-05-2026 12:00 AM
  1. బొంగుల రాష్ట్ర సమితి పార్టీ... వచ్చే ఎన్నికల్లో కనుమరుగు
  2. ప్రజలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చెప్పుతో కొట్టి పక్కనేశారు
  3. గత పాలనలో వారివన్నీ రియల్ ఎస్టేట్ ఇసుక దందాలే
  4. 25 లోపు పూర్తిగా ధాన్యం కొనుగోలు చేస్తాం
  5. డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత

నల్లగొండ టౌన్, మే 19  :  బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగిన సభను చూస్తే రైతు హంతకుల సభను తలపించిందని నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఎద్దేవా చేశారు. మంగళవారం స్థానిక యాదవ్ సంఘం భవన్లో నిర్మించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు 10 సంవత్సరాలు తెలంగాణలో పాలన చేసిన కేసీఆర్ వారి చెంచాలు రైతులకు ద్రోహం చేసి వారికి ఖజానా నింపుకున్నారని . ఏక కాలంలో రైతులకు లక్ష రూపాయల ‘రుణమాఫీ‘ అంటూ రైతులను ముంచిన హంతకులనీ అన్నారు.

బిఆర్‌ఎస్ పాలనలో 10వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కల్లాల వద్ద రైతులు చనిపోయిన సంఘటనలు నేటికీ గుర్తుకు ఉన్నాయన్నారు. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసి హింసించిన సంఘటనలు ప్రజలు మర్చిపోలేదన్నారు. ‘వరి వేస్తే ఉరి‘ అని రైతులను మోసం చేసింది కెసిఆర్ కాదా.  నల్లగొండ జిల్లాలో మిల్లర్లతో కుమ్మకై వంద కోట్లు సంపాదించింది ఆనాటి మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే.  దేశభక్తుడు, నిజాయితీపరుడైన మంత్రి ఉత్తంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించం అన్నారు .

6సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2సార్లు మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించిన ఉత్తంకుమార్ రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలని తప్పుతోవ పట్టించాలని చూస్తుంన్నారని ప్రజానా యకునిగా అందరి మన్ననలు పొందిన ఉత్తంకుమార్ రెడ్డి కాలిగోటికి బిఆర్‌ఎస్ నాయకులు సరిపోన్నారు. ఉచిత కరెంటు ,2 లక్షల రుణమాఫీ, ప్రతి క్వింటాకు 500 బోనస్ తీసుకువచ్చి దేశ చరిత్రలో నిలిచిపోయిన పాలన అందిస్తున్నది రేవంత్ సర్కార్ అని కొనియాడారు. 

ఉద్యోగాలు పోయిన వజిబ్ దారులు మీటింగ్ పెట్టారని అన్నారు. 75% వరి ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యాయని ఈనెల 25వ తేదీ లోపు 100 శాతం పూర్తి చేస్తామన్నారు.48 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని ఎమ్మెల్యే, ఎంపీ మంత్రులు రాత్రి పగలు లేకుండా ఐకెపి సెంటర్స్ సందర్శించి రైతులకు భరోసా ఇస్తున్నారని. రైతులు, నిరుద్యో గులు, మహిళలు, మధ్యతరగతి ప్రజల దీవెనలతో 2029లో మరోసారి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ రానున్నదని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ ద్రోహులు,రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు, ఇసుక భూ దోపిడీ దారుల హంతకులతో కలుషితం అయిన బిఆర్‌ఎస్ అసలు సిసలైన సంకర జాతి గాళ్లదని చెబుతూ జగదీశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య లను ఖండించారు కాంగ్రెస్‌లో ఉన్నది సంకరజాతి అయితే కేసీఆర్ కాంగ్రెస్ నుంచే వచ్చారని జిల్లాకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు వివిధ పార్టీల నుంచి వచ్చారని ఈ విషయం గుర్తుంచుకోవాలని సూచించా రు కెసిఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా కొట్లాడి సీఎం కూర్చి ఎక్కిన బాహుబలి రేవంత్ రెడ్డి అని అన్నారు.  నాయకులు యాల రవీందర్ రెడ్డి, బోడ స్వామి, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, మధగోని వెంకన్న, వావిళ్ళ దేవదాస్, నాగరాజు,పొట్ట మధు, శరత్, వినీత్, సచిన్  పాల్గొన్నారు.