29 July, 2026 | 7:58 PM

Breaking News

బెల్లం రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం   •   అటవీ జంతువుల ప్రాణాలే లక్ష్యం..   •   రామాయంపేటలో కొత్త పోలింగ్ బూత్‌లకు బీజేపీ డిమాండ్   •   కామారెడ్డి జిల్లా యోగ భవన్లో గురు పౌర్ణమి వేడుకలు   •   కేరళ గ్లోబల్ హైస్కూల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   విద్యార్థుల సమగ్ర వికాసమే ఉపాధ్యాయుల ఏకైక లక్ష్యం విద్యార్థుల వికాసం కోసం పనిచేయాలి   •   జూలై 30న సత్తుపల్లిలో ఎన్‌సీపీ - ఎన్‌డీఏ కూటమి (ఎన్‌వైసీ) రాష్ట్ర కార్యాలయం ప్రారంభం   •   పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యం   •   శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో గురు పౌర్ణిమ వేడుకలు   •   పలుగ్రామపంచాయతీలలో ప్రత్యేక సమావేశాలు   •  

మహా కుంభ్ వెళ్తున్న మినీ బస్ ప్రమాదం.. నలుగురు మృతి

12-02-2025 05:14 PM

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా(Fatehpur District)లో బుధవారం మినీ బస్సు ట్రాక్టర్-ట్రైలర్‌ను ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మహా కుంభ్‌లో(maha kumbh mela) పాల్గొనడానికి వెళ్తున్న 21 మంది ప్రయాణికులతో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న మినీ బస్సు బక్సర్ మలుపు సమీపంలో ట్రాక్టర్-ట్రైలర్‌ను ఢీకొట్టిందని వారు తెలిపారు.

అలహాబాద్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) ప్రేమ్ కుమార్ గౌతమ్ మాట్లాడుతూ, "సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించారు. ఇద్దరు యాత్రికులు, డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు." మృతులను మినీ బస్సు డ్రైవర్ వివేక్ సింగ్ (27), యాత్రికులు ప్రేమ్ కాంత్ ఝా (55), దిగంబర్ ఝా (52), విమల్ చంద్ర ఝాన్ (50)గా గుర్తించారు. వీరంతా న్యూఢిల్లీ నివాసితులు. కేసు నమోదు చేసి, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఫతేపూర్ ఎస్పీ ధవల్ జైస్వాల్ తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు ఆయన తెలిపారు.