29 July, 2026 | 8:03 PM

Breaking News

పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యం

29-07-2026 07:30 PM

తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపాలిటీ నాలుగో వార్డ్ లోని రోడ్డు పక్కన ఉన్న పిచ్చిగడ్డిని  డోజర్ సాయంతో కౌన్సిలర్ జైపాల్ నాయక్ తొలగించే చర్యలు చేపట్టారు. బ్రాహ్మణ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు సలాక రాజేశ్వర్ శర్మతో కలిసి పుట్టకోట స్కూల్ నుంచి క్రింది వాడకట్టు వరకు రోడ్డు పక్కన ఉన్న పిచ్చిగడ్డిని రోడ్డు పైన ఉన్న మట్టిని మున్సిపల్ సిబ్బందితో కలిసి వార్డులో పర్యటించి పిచ్చిగడ్డిని తొలగించారు.

వారు మాట్లాడుతూ వానకాలం సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గనుక చుట్టు ప్రక్కల నీళ్ళు నిలువకుండా పరిశుభ్రత ఉంచుకోవాలని కోరారు.  వార్డులోని క్రీడాప్రాంగణం వెళ్లే దారిలో నీళ్లు ఆగుతున్నా విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లామని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో మెదక్ జిల్లా అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు బండ నాగరాజు యాదవ్, మైనార్టీ నాయకులు హైమద్, సీఎం. శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.