29 July, 2026 | 8:23 PM

కామారెడ్డి జిల్లా యోగ భవన్లో గురు పౌర్ణమి వేడుకలు

29-07-2026 07:39 PM

ఘనంగా యోగ గురువులకు సన్మానం

కామారెడ్డి,(విజయక్రాంతి): గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా కామారెడ్డి యోగ ఆశ్రమంలో యువ గురువులను ఘనంగా సన్మానించారు. యోగా గురువు లు రామ్ రెడ్డి, గరీపల్లి అంజయ్య గుప్తా, టి అంత రెడ్డి లను శాలువాతో ఘనంగా సన్మానించారు. గురువుల ఆశీస్సులు మానవ జీవితానికి దిక్సూచి వంటివని గురువు చూపిన మార్గంలో నడవడం ప్రతి శిష్యుని బాధ్యత అని గురువులు పేర్కొన్నారు. యోగ, ధ్యానము, భారతీయ సంస్కృతి కాపాడటం మీ యొక్కనైతిక బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాసరగుకుమార్,  అంజయ్య, అనిల్ రెడ్డి,రమేష్, సిద్దా గౌడ్, ఎల్లయ్య, ప్రవీణ్, ఆంజనేయులు, సురేష్, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.