29 July, 2026 | 8:06 PM

Breaking News

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు విఫలం   •   విధుల్లో ఉండగానే కార్మికుడి మృత్యువాత...   •   హైవేపై ఉన్న షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి   •   బెల్లం రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం   •   అటవీ జంతువుల ప్రాణాలే లక్ష్యం..   •   రామాయంపేటలో కొత్త పోలింగ్ బూత్‌లకు బీజేపీ డిమాండ్   •   కామారెడ్డి జిల్లా యోగ భవన్లో గురు పౌర్ణమి వేడుకలు   •   కేరళ గ్లోబల్ హైస్కూల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   విద్యార్థుల సమగ్ర వికాసమే ఉపాధ్యాయుల ఏకైక లక్ష్యం విద్యార్థుల వికాసం కోసం పనిచేయాలి   •   జూలై 30న సత్తుపల్లిలో ఎన్‌సీపీ - ఎన్‌డీఏ కూటమి (ఎన్‌వైసీ) రాష్ట్ర కార్యాలయం ప్రారంభం   •  

శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో గురు పౌర్ణిమ వేడుకలు

29-07-2026 07:27 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ హై స్కూల్ లో బుధవారం భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గురు పౌర్ణిమ (వ్యాస పూర్ణిమ) వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతిలో గురువుకు దైవం కంటే ఉన్నతమైన స్థానం ఉందనే భావనను విద్యార్థులకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా నిర్వహించబడింది. గురు పౌర్ణిమను మహర్షి వేదవ్యాసుల జయంతిగా కూడా భావిస్తూ గురు-శిష్య పరంపరకు విశిష్టమైనదిగా గుర్తించబడుతుంది.

కార్యక్రమం ప్రారంభంలో భారతమాత, సరస్వతీ మాత, మహర్షి వేదవ్యాసుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి, దీపప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ మాట్లాడుతూ, గురువు కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదని, విద్యార్థులలో క్రమశిక్షణ, సంస్కారం, దేశభక్తి, సేవాభావం, నైతిక విలువలను పెంపొందించి జీవితాన్ని సన్మార్గంలో నడిపించే మార్గదర్శి అని వివరించారు. మహర్షి వేదవ్యాసులు వేదాలను విభజించి, మహాభారతం, పురాణాల వంటి అమూల్య గ్రంథాలను రచించి భారతీయ జ్ఞాన సంపదను ప్రపంచానికి అందించిన మహనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.