పలుగ్రామపంచాయతీలలో ప్రత్యేక సమావేశాలు
బీబీపేట,(విజయక్రాంతి): బీబీపేట మండలంలోని యాడారం మహమ్మదాపూర్ జనగామ ఇస్సానగర్ ఉప్పరపల్లి షేర్ బి పెట్ తుజాల్పూర్ మల్కాపూర్ కోనాపూర్ గ్రామపంచాయతీలలో జలసిరి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీఛార్జ్ సోక్ పిట్స్ , పౌంమ్ పౌండ్స్, చేపల చెరువుల నిర్మాణం వంటి వాటిని రైతులు నిర్మించుకోవాలని అంతేకాకుండా నీటిని ఎలా నిలువ చేసుకోవాలి భూగర్భ జలాలను ఎలా పెంపొందించుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు.
అంతేకాకుండా గ్రామాలలోని సమస్యలు పరిష్కరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు మురికి కాలువలు,రోడ్లపై గుంతలను పూడ్చివేయడం, గ్రామాలలో నీటిని నిల్వ ఉంచకుండా సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు సీజనల్ జాతర పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోమల నివారణకు మీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు అనవసరమైన గుంతలను పూడ్చివేయాలని అలా గుంతలు మురికి కాలువలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచులు కార్యదర్శులు గ్రామ ప్రజలకు తెలియజేశారు కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్లు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






