17 April, 2026 | 9:37 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

బాణసంచా కర్మాగారంలో పేలుడు: నలుగురు మృతి

16-06-2025 03:51 PM

అమ్రోహా: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం(Uttar Pradesh) అమ్రోహాలోని రాజత్‌పూర్ పోలీస్ స్టేషన్(Rajatpur Police Station) పరిధిలోని లైసెన్స్ పొందిన బాణసంచా కర్మాగారంలో(Fireworks Factory) సోమవారం జరిగిన పేలుడులో నలుగురు మహిళలు అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పేలుడు ఎంత తీవ్రంగా ఉందంటే, శిథిలాలు 300 మీటర్ల దూరం ఎగిరిపడ్డాయి. పేలుడు ప్రభావంతో ఫ్యాక్టరీ సమీపంలోని భవనాలు, టిన్ షెడ్లు శిథిలాలుగా మారాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. 

అమ్రోహా డిఎం నిధి గుప్తా వాట్స్ మాట్లాడుతూ, "రజత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో నలుగురు మహిళలు మరణించారు. ఆరుగురు మహిళలు గాయపడ్డారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు." అని డిఎం నిధి గుప్తా తెలిపారు. "రజత్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అత్రాసి గ్రామంలో బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే, పోలీసులు, అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఇది హాపూర్‌కు చెందిన సైఫ్-ఉర్-రెహ్మాన్ పేరు మీద నమోదు చేయబడింది. నలుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటనలో ఆరుగురు మహిళలు గాయపడ్డారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. దర్యాప్తు జరుగుతోంది." అని అమ్రోహా ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ తెలిపారు.