17 April, 2026 | 11:15 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బుధేరా పంచాయతీ కార్యదర్శి

16-06-2025 03:18 PM

హైదరాబాద్:  ఇంటి నిర్మాణం అనుమతి కోసం లంచం తీసుకుంటూ మహిళా గ్రామపంచాయతీ కార్యదర్శి అవినీతి నిరోధక బ్యూరో అధికారులకు పట్టుబడ్డింది. వివరాల్లోకి వెళ్తే... సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని నిర్మాణం అనుమతి కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మిని కలిశాడు. అందుకు కార్యదర్శి రూ.8 వేలు లంచం డిమాండ్ చేసింది. చేసేదేమిలేక సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి ముందస్తూ ప్రణాళిక ప్రకారం కార్యదర్శి నాగలక్ష్మి బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.