calender_icon.png 5 February, 2026 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల తనిఖీల్లో నాలుగు లక్షలు సీజ్

05-02-2026 03:37:52 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ 05-02-2026, ఉదయం సుమారు 11:00 గంటలకు, కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మండలం, తంగళ్ళపల్లి బ్రిడ్జి వద్ద ఉన్న ఎస్ ఎస్ టి చెక్‌పోస్ట్లో వాహన తనిఖీలు నిర్వహించబడినవి. ఈ సందర్భంగా TS 09 ER 7367 నంబర్ గల కారును పోలీస్ బృందం ఆపి తనిఖీ చేయగా, కార్ డ్రైవర్/యజమాని పురుమడ్ల వెంకట్ రెడ్డి, తండ్రి: నారాయణ రెడ్డి, నివాసం: చండ్లాపూర్ గ్రామం, చిన్నకోడూరు మండలానికి చెందిన వ్యక్తి, తన కారులో లెక్కలలో లేని అనుమానాస్పదమైన నగదు రూ. 4,00,000/- రూపాయలు నాలుగు లక్షలు తీసుకెళ్తున్నట్లు గుర్తించబడినది. ఇతను సిరిసిల్లకు  వెళుతున్నట్లు తెలిపినాడు.ఆ నగదు మొత్తాన్ని ఎన్నికల నిబంధనలు  చట్టపరమైన విధానాల ప్రకారం, ఎస్ ఎస్ టి బృంద ఇన్‌చార్జ్  శ్రీకాంత్  పంచుల సమక్షంలో పంచనామా సాక్షుల స్వాధీనం చేసుకోవడమైనది. ఆ నగదు యొక్క మూలం  ఉపయోగ ఉద్దేశ్యం తెలుసుకునేందుకు తదుపరి విచారణ  దర్యాప్తు కొనసాగుతోంది. అని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కె.కృష్ణ  తెలిపినారు.