08-01-2025 12:00:00 AM
ప్రత్యుత్పన్నార్థకచ్ఛ్రః
సంగహ్ణీయాత్
- కౌటిలీయం: (5--
“అనుకోని ఆర్థిక పరమైన ఇబ్బందులవల్ల ఆర్థిక స్థితి ఒడుదొడుకులను ఎదు ర్కొనే సమయంలో, కోశాన్ని పెంచుకునేందుకు పాలకులు ప్రయత్నించాలి” అంటా డు చాణక్య. సంస్థకు అన్ని విభాగాలూ ప్ర ముఖమైనవైనా ఆర్థిక వ్యవస్థ గుండె వం టిది. అది బలహీనమైతే ఎన్ని వ్యవస్థ లు ఆరోగ్యంగా ఉన్నా ఉపయోగం ఉండ దు. ఆస్తులు, అప్పులు, ఆదాయం, ఖర్చు లుఞూ ఈ నాలుగు స్తంభాల నియంత్రణపై సంస్థ ఆర్థిక స్థితి ఆధారపడి ఉంటుంది.
ఆర్థిక క్రమశిక్షణ లేని సంస్థ నిలదొక్కుకోవడం కష్టం. ఆర్థికంగా ఎదిగేందుకు ఉత్పత్తులను నగదుగా మార్చుకోవడం, వ్యయ నియంత్రణతోపాటు వ్యర్ధాలను వదిలించుకోవ డం చేయాలి. ఇవి సాధించడానికి సరైన బడ్జెట్ ప్రణాళికలు తయారు చేసుకోవాలి. వాటిని నిరంతరం పర్యవేక్షించడం, నిబద్ధతతో పాటించడం అవసరం. దార్శనికత క లిగిన నాయకుడు చేసిన బడ్జెట్లో అయి తే వ్యయం, ప్రయోజనాలపై కచ్చితమైన అంచనాలు ఉంటాయి.
నిర్వహణలో అప్పులు తీసుకోవడం అ నివార్యమైతే అవి సంస్థ అభివద్ధికి కేటాయించాలే కాని చేసిన అప్పులు తీర్చేందు కో మరొక దానికో తీసుకుంటే పరిస్థితి మ రింత నిర్వీర్యం అవుతుంది. అప్పులు సంస్థ నిర్వహణలో ఆస్తులను పెంపొందింప చేయడానికి లేదా ఉత్పత్తిని సాధించేందుకు ఉపయోగించడం వల్ల ఆదాయం వృద్ధి అవుతుంది. అప్పులు తీర్చేందుకు వె సులుబాటూ కలుగుతుంది.
నాణ్యమైన ఉత్పత్తులను ఎంత సరసమైన ధరకు అం దించగలిగితే అమ్మకాలు అంతగా పెరుగుతాయి. ఉత్పత్తిలో నాణ్యతా సాధన, పరిశోధన, అభివృద్ధి విభాగాలను బలోపేతం చేయడం, నిరంతరం కొత్తదనాన్ని అన్వేషించడంపై వ్యయించిన ప్రతి పైసా దానికి మరెన్నో రెట్ల ఫలితాల్ని ఇస్తుంది. విలువను పెంచుకున్న ఉత్పత్తులు అమ్మకాలను పెంచుతాయి. ఉత్పత్తులు అమ్ము కోవడం మాత్రమే కాదు, వాటిని నగదుగా మార్చుకోవడమూ ముఖ్యమే.
లక్ష్మణరేఖ ఉండాలి
ఆర్జించిన సంపదలో అప్పులను, పన్నులను నిబద్ధతతో, సమయానికి చెల్లించడం సంస్థ పరపతిని పెంచుతుంది. అలాగే, త ప్పనిసరిగా కొంత సొమ్మును భావి అవసరాలకై దాచుకోవాలి. వాటిని సంస్థ ఉన్నతీ కరణకు లేదా ఉత్పత్తిని పెంచడానికి వినియోగించడం ప్రయోజనకారం. సంస్థ సంపద యజమాని సంపద కాదు. రెంటిమధ్య కచ్చితమైన లక్ష్మణరేఖను పాటించాలి.
దేశానికి రాజైనా, సంస్థకు యజమానైనా తనకంటూ కొంత ధనాన్ని జీతభత్యా ల కింద తీసుకొని దానిని వ్యక్తిగత ఖర్చులకై వినియోగించుకోవాలే. అంతేకాని, సం స్థ ధనాన్ని తన ధనంగా వాడుకోవడం సరైన విధానం కాదు. మహాభారతంలో నారదుడు దర్మరాజును, “నీ ధనము నీవు చేయు యజ్ఞ దాన కుటుంబ రక్షణాది కా ర్యములు నెరవేర్చుటకు సరిపోవుచున్నదా?” అని ప్రశ్నించడం కనిపిస్తుంది. “నీ ధనము” అనడంలో రాజకోశాన్ని నీ కోశంగా వాడుకోవడం లేదు కదా అనే హెచ్చరిక ఉన్నది.
ఆర్థిక నియంత్రణ, క్రమశిక్షణల గురించిన సంపూర్ణ జ్ఞానం కలిగిన నాయకుడు సంస్థ సాధించిన లాభాలలో అధిక మొత్తా న్ని తిరిగి వివిధ విధానాలలో పెట్టుబడిగా పెడతాడు. ఎలాగైతే సంస్థ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారో అలాగే! నాయకుడు వ్యక్తిగత ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి. ముఖ్యం గా యజమానిగా తాను పొందిన జీతభత్యాలలో తన నైపుణ్యాలను ఉ న్నతీకరించుకునేందుకు, మానసిక ఉల్లాసానికి అవసరమైన మొత్తంలో వ్యయిం చాలి.
అవసరాలకు చేసే స్నేహాలు కాకుం డా నిజమైన స్నేహితుల బృందాన్ని తప్పక కలిగివుండాలి. సాధారణంగా స్నేహితుల నిజమైన అవసరాలకు మనం సహాయపడడం లేదా వారినుంచి సహాయం పొంద డం అవసరమే. కాని, ఎవరికైనా అప్పుగా ఇచ్చిన సొమ్మును ప్రేమతో ఇచ్చినట్లుగా భావిస్తూ తిరిగి వారినుంచి ఆశించక పోవడం ఉత్తమం.. ఎవరికైనా మన ఆర్థిక పరిధిలోనే సహాయ పడడం మంచిది.
పాలకుర్తి రామమూర్తి