7 March, 2026 | 4:59 PM

ఓంకారేశ్వర ఆలయ నాలుగో వార్షికోత్సవం

07-03-2026 12:00 AM

ఓంకారేశ్వర స్వామిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు

కామారెడ్డి, మార్చ్ 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో నెలకొల్పిన ఓంకారేశ్వర్ ఆలయం నాలుగో వార్షికోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.శుక్రవారం ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని బిజెపి రాష్ట్ర నాయకులు ప్రముఖ సైంటిస్ట్, పారిశ్రామికవేత్త, పైడి ఎల్లారెడ్డి  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఓంకారేశ్వర స్వామిని దర్శించుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు డా.పైడి ఎల్లారెడ్డి నీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఓంకారేశ్వరాలయంలో బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ ఓంకారేశ్వర స్వామి దయవల్ల కరుణ కటాక్షాల వల్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పైడి ఎల్లారెడ్డి కోరారు. 

ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మామిళ్ల రాజు,వీరన్న పటేల్, ఆలయ కమిటీ అధ్యక్షుడు కపిల ప్రభాకర్, కంది శివరాములు, బండాయప్ప స్వామి, గంజి సంగమేశ్వర్, పటేల్ రాజు, బిజెపి మహిళ అధ్యక్షురాలు బాలమణి తదితరులు పాల్గొన్నారు.