7 March, 2026 | 6:22 PM

99 రోజుల కార్యాచరణను అమలుచేయాలి

07-03-2026 12:00 AM

పని చేయక జీతాలు పొందుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు

మంత్రి జూపల్లి వెల్లడి

ఫారెస్ట్ అధికారుల తీరుపై మండిపడ్డ ఎంపీ, ఎమ్మెల్యేలు

ఆదిలాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు అందేవి ధంగా చర్యలు తీసుకోవాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ, ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను జిల్లా ల్లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీ, ఎమ్మెల్యే లు, ఉమ్మడి జిల్లా కలెక్టర్, ఎస్పీ, తదితరులతో కలిసి కార్యక్రమంపై సమీక్షించి, అధికా రులకు దిశా నిర్దేశం చేశారు.

మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పట్ల ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడమ బొజ్జు పటేల్ మండిపడ్డారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని, భూ సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మరమ్మతులు ఏమైనా ఉంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సి పల్ చైర్ పర్సన్ అనూష, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్మల్, కుమ్రం భీం ఆసిఫా బాద్, మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సైతం సమావేశంలో పాల్గొన్నారు.