పల్లె ప్రకృతి వనాలపై పట్టింపు ఏది?
వాంకిడి, మార్చి 6 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం కోసం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు సరైన నిర్వహణ లేక నిరాదరణకు గురవుతున్నాయి. మండలంలోని గణేష్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2020లో ఉపాధి హామీ నిధులతో ఈ వనా న్ని ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను నాటారు. అయితే ప్రస్తుతం వాటిలో కొన్ని మాత్రమే పెరిగి పెద్దవిగా మారగా, మరికొన్ని మొక్కలు ఎండిపోతున్నాయని గ్రామ స్తులు చెబుతున్నారు. ముఖ్యంగా నీటి సదుపాయం లేకపోవడం వల్ల మొక్కలు నిలువ లేకపోతున్నాయని ఆరోపిస్తున్నారు.
అదేవిధంగా ప్రకృతి వనం పిచ్చి మొక్కలు, పొదలతో నిండిపోవడంతో వనం ఆకృతిని కోల్పోయి నిరుపయోగంగా మారుతోందని తెలిపారు.మండలంలోని 28 గ్రామపంచాయతీల్లో గతంలో గులాబీ, మందారం, మల్లె, చాగంటి వంటి పూల మొక్కలతో పా టు మామిడి, సపోటా, జామ, దానిమ్మ వం టి పండ్ల మొక్కలను నాటారు. అయితే సరై న పర్యవేక్షణ లేకపోవడంతో ఈ వనాలు క్ర మంగా పాడైపోతున్నాయని స్థానికులు అం టున్నారు. హరిత నిలయాలుగా ఉండాల్సిన ఈ వనాలు నిర్లక్ష్యంతో పొందరిల్లులుగా మారుతున్నాయని ఇకనైనా సర్పంచులు, గ్రామ కార్యదర్శులు పల్లె ప్రకృతి వనాల సంరక్షణపై శ్రద్ధ చూపి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.




