21 August, 2026 | 7:56 AM

ఎఫ్‌పీఐ పెట్టుబడులు

10-06-2024 12:05 AM

గతవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి రూ.16,971 కోట్ల నిధుల్ని వెనక్కు తీసుకున్నారు. కానీ వారు డెట్ మార్కెట్లో రూ. 4,689 కోట్ల నికర పెట్టుబడులు చేశారు. జూన్ 8తో ముగిసిన వారంలో దేశీయ సం స్థాగత ఇన్వెస్టర్లు రూ.5,578 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా కొనుగోలు చేశారు. అంచనాలకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వెలువడనందున ఈ వారం కూడా ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.